తెలుగుదేశం అధినేత, చంద్రబాబు నాయుడును కుట్ర పూరితంగా, రాజకీయ కక్షతో ఇబ్బంది పెడుతున్న తీరుకు, ఆయనపై అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఎన్నారైలు టాంజానియా దేశ ఆర్థిక నగరం దార్ ఎస్ సలాంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకి న్యాయం జరిగేదాకా తమ ఉద్యమని ఇలాగే కొనసాగిస్తామని టాంజానియా రాజధాని దార్ ఎస్ సలాం సిటీలోని తెలుగు కమ్యూనిటీ వారు నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకున్నారు. చంద్రబాబు విడుదల అయ్యేవరకూ కార్యక్రమాలు నిర్వహించి తమ సంఘీభావం తెలిపేందుకు నిర్ణయించారు. We are with CBN అని నినదించారు. తెలుగు వారి అభ్యున్నతికి, అభివృద్ధికి పాటుపడే చంద్రబాబు వంటి నాయకుడి పట్ల ప్రభుత్వ తీరు సక్రమంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులు, అభిమానులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.