ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలోని బసంపల్లి గ్రామానికి చెందిన పాలబండ్ల మధుసూదన్, పద్మక్కలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. ప్రస్తుతం వారి పెద్దనాన్న శ్యామ్‌సుందర్ సంరక్షణలో ఉన్నారు. అనాథలుగా మారిన చిన్నారుల గురించి తెలుసుకున్న ప్రవాసాంధ్రుడు పురుషోత్తం వారికి సహాయపడేందుకు ముందుకు వచ్చారు. చిన్నారులు పాటిబండ్ల అశ్విని, లక్ష్మిలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. రూ.10 వేల విలువైన దుస్తులు అందజేశారు. భవిష్యత్‌లో కూడా వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానభారతి విద్యాసంస్థల అధినేత రమేశ్ బాబు, వెంకట్ ( అమెరికా), అచ్చంపల్లి రమేశ్, కొండయ్య,, కొల్లి వెంకటేశ్ చౌదరి, కమ్మ సంఘం నాయకులు ఉన్నారు.
