Namaste NRI

ఎన్నారై రమేశ్‌ బాబు ఇసంపల్లి భూ విరాళం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి లండ‌న్‌కు చెందిన ఎన్నారై, బీఆర్ఎస్ నాయ‌కుడు ర‌మేశ్ బాబు ఇసంప‌ల్లి ఆక‌ర్షితుల‌య్యారు. మంత్రి కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన సొంతూరు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని హమాలీవాడలోని ప్రభుత్వ ప్రాథ‌మిక పాఠశాల పక్కన ఉన్న తన 8 గుంటల విలువైన భూమిని స్కూల్‌కు విరాళంగా అందించారు. ప్రగతి భవన్‌లో టీఎస్‌ఎఫ్‌డీసీ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లంతో కలిసి దీనికి సంబంధించిన పత్రాలను మంత్రి కేటీఆర్‌కు అంద‌జేశారు. విదేశాల్లో ఉంటూ తెలంగాణ గడ్డపై చూపిస్తున్న ప్రేమ పట్ల, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమములో పాలు పంచుకున్నందుకు ఎన్నారై రమేశ్ బాబును మంత్రి కేటీఆర్ అభినందించారు.

ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మన ఊరు-మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. కేటీఆర్ పిలుపుతో స్ఫూర్తి పొంది తనవంతు సహకారం అందించానని తెలిపాడు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. ఇటీవల లండన్‌లో పర్యటించిన కేటీఆర్ తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి రావాలని ఎన్నారైలకు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events