Namaste NRI

చంద్రబాబుకు మద్దతుగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, జనసేన నిరసనలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని మిన్నియాపోలిస్‌, మిన్నెసోటా నగరాల్లో టీడీపీ, జనసేన నేతలు పలుచోట్ల సమావేశమయ్యారు. ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి విపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాల పాటు మచ్చలేని నాయకుడిగా ఉంటూ సుపరిపాలన అందించిన చంద్రబాబుపై జరుగుతున్న అప్రజాస్వామిక దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.  ఈ సమావేశాల్లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, జనసేన కమిటీ సభ్యులు, కమ్యూనిటీ లీడర్లు   We Are With CBN Save Democracy నినాదాలు  చేశారు. ఈ కార్యక్రమంలో   పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పెద్దలు  పాల్గొని చంద్రబాబుకు తమ మద్దతు ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events