
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన ఏపీ సీఎం సహాయ నిధికి ఉత్తర అమెరికా ఎన్నారై టీడీపీ శ్రేణులు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశాయి. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కు అందజేశారు. పార్టీ కోసమే గాక, ప్రజల కోసం కూడా పరితపించే కార్యకర్తలు కేవలం టీడీపీకే సొంతమని డా. పెమ్మసాని పేర్కొన్నారు. ఈ విరాళాలు అందజేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.
