టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వివిధ దేశాల్లోని ఎన్నారైలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఎన్నారైలు చంద్రబాబుకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాము చంద్రబాబుకు మద్దతుగా ఉంటామంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఏపీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబును విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.