తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధ్యక్షునిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఎన్నారై ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ రైతుబంధు, దళిత బంధు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్నారని ప్రశంసించారు. ఎన్నారైలకు మొట్ట మొదటి సారి కేసీఆర్ తరపున అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిపారు.














