దళితుల సాధికారత కోసం తెచ్చిన తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఎన్నారైలంతా హర్షిస్తున్నారని ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ది ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అనిల్ కూర్మాచలం తెలిపారు. నాడు హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభించినప్పుడు ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నానని, అలాగే తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభానికి కూడా హాజరవుతానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారని అనిల్ తెలిపారు.