తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్నారైలు భేటీ అయ్యారు. తెలుగుదేశం మెల్‌బోర్న్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడుకు రావాలని కోరుతూ చంద్రబాబు నాయుడు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎన్నారై టీడీపీ వెబ్‌సైట్ ద్వారా ఎన్నారైలు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని చంద్రబాబు వారిని కోరారు. ఈ భేటీలో ఎన్నారై టీడీపీ సెల్ కో ఆర్డినేటర్ రాజశేఖర్‌తో పాటు టీడీపీ మెల్‌బోర్న్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం ఎన్నారైలు చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)