టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు యూకేలోని లండన్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుడు సుమన్ రావు బాలమూరి ఆధ్వర్యంలో దేశం కోసం కేసీఆర్, కేసీఆర్ కోసం ఎన్ఆర్ఐ అని నినదిస్తూ.. సుమారు వంద మందితో మద్దతు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశ ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ను స్థాపించడం శుభపరిణామన్నారు. టీఆర్ఎస్ లాంటి పాలన తమకు కూడా రావాలని కేసీఆర్కు వినతులు వస్తున్నాయని తెలిపారు.
నాడు టీఆర్ఎస్ లానే నేడు బీఆర్ఎస్ స్థాపన, కార్యాచరణ, ప్రణాళిక బద్దంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. బీఆర్ఎస్లో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషిస్తారని, త్వరలో పార్టీ పెద్దలని కలుస్తామని వెల్లడిరచారు. బీఆర్ఎస్లో పని చేయడానికి, భావజాలాన్ని దేశ వ్యాప్తం చేయడానికి బాధ్యత తీసుకుంటామని తెలిపారు. త్వరలో యూకేలో ఉన్న వివిధ రాష్ట్రాల ఎన్ఆర్ఐలతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కూడగడతామని తెలిపారు.