Namaste NRI

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు.. ఎన్ఆర్ఐల మ‌ద్ద‌తు

సిడ్నీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆస్ట్రేలియా మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి  ఆధ్వర్యంలో  గ్లోబల్  ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల  మహిళా రిజర్వేషన్ బిల్లు కు ఎన్ఆర్ఐల‌ మద్దతుకై ప్రచారాన్ని ప్రారభించారు. మహేష్ బిగాల మాట్లాడుతూ  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐల‌ మద్దతు కోసం మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రచారం ప్రారంభించామని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తి చెందేలా కృషిచేశారు. నాడు హైదరాబాద్‌ లాంటి పట్టణాల్లో, విదేశాల్లో ఆత్మన్యూనతకు గురైన బతుకమ్మ నేడు ఆయా దేశాలు బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహించేస్థాయికి తీసుకొచ్చారని తెలిపారు.

బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి  మాట్లాడుతూ ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి బిల్లును సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, కన్వీనర్ రవిశంకర్ ధూపాటి, లివింగ్స్టున్ చెట్టిపల్లి, అమ్రీన్, గుల్షన్ ఆర, స్వప్న నెల్లీ, పరశురామ్, అజాజ్, ఇస్మాయిల్, చిరాన్ పురంశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News