ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ చిత్రం, ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాయి. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. ఈ ఎక్స్పెక్టేషన్స్ ధీటుగా మేకర్స్ మూవీని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే ఈ డైరెక్టర్ మరోసారి ఎన్టీఆర్‌తో అందరినీ మెప్పించేలా యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నారు.














