తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మారిశెట్టి శివకుమార్ ఆధ్వర్యంలో రియాద్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సౌదీ అరేబియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే సిద్ధాంతాలను తూచా తప్పకుండా నారా చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఎన్నారై కార్యకర్త కృషి చేయాలని వడ్లమూడి సారధి నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో బొంతు నాయుడు, గుణశేఖర్, చక్రపాణి, చంద్రబాబు, మహబూబ్ బాషా, నరసింహనాయుడు, అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎన్నారై కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-73.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-73.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-77.jpg)