తెలుగుదేశం ఫోరం (సింగపూర్) ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి అన్నగారు అంటూ ఎన్టీఆర్‌తో తనకున్న అనుభవనాలను పంచుకున్నారు. పేదకి కూడు గుడ్డ నీడ.. ఇలా దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్నగారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.


బడుగు బలహీన వర్గాలకి రాజకీయాన్ని పరిచయం చేసింది అన్నగారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొనియాడారు. అందరూ సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నా యి. 800 మంది పైగా ఎన్టీఆర్ అభిమానులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

