మెహబూబ్ దిల్‌సే, శ్రీసత్య ప్రధాన పాత్రల్లో నటించిన నువ్వేకావాలి అనే ప్రైవేట్ గీతాన్ని ఇటీవల ఆవిష్కరించారు. భార్గవ్ రవడ దర్శకుడు. సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని భార్గవ్ రవడ, వైషు మాయ ఆలపించారు. మనీష్ కుమార్ సంగీతాన్నందించారు. యూరప్‌లోని బార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి అందమైన లొకషన్లలో ఈ పాటను తెరకెక్కించారు.
ఈ సందర్భంగా మహబూబ్ మాట్లాడుతూ అందమైన ప్రేమభావనలకు అద్దం పట్టే గీతమిది. పాట లొకేషన్లు చాలా బాగున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. మెలోడీ ప్రధానంగా ఈ పాట సంగీత ప్రియులందరికి నచ్చుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్‌కృష్ణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.