Skip to main content

Namaste NRI

ఎన్విడియా సీఈవో జెన్సన్‌ రాజీనామా

చైనా నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆమెరికా అధికారులు అనుమానిస్తున్న ఒక మహిళతో వివాహేతర సంబంధంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎన్విడియా నీఈవో జెన్సన్‌ మువాంగ్‌ తన ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, బోర్డు సభ్యత్వ పదవులకు తక్షణమే రాజీనామా చేసినట్టు కంపెనీ బోర్డు ప్రకటించింది. తాత్కాలిక సీఈవోగా ఎన్విడియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కోలెట్‌ క్రెస్‌ను బోర్డు నియమించింది. శాశ్వత సీఈవో నియామకం జరిగేవరకు ఆమె సీఈవోగా కొనసాగుతారు.

హువాంగ్‌కు నేరుగా రిపోర్ట్‌ చేసే ఎన్విడియా హెల్త్‌కేర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కింబర్లీ పావెల్‌తో రెండవ వివాహేతర సంబంధం ఉన్నట్టు వార్తలు వెలువడడంతో బుధవారం ఈ కుంభకోణం మరింతగా ముదిరింది. ఎన్విడియా సహ-వ్యవస్థాపకుడైన హువాంగ్‌ సుమారు 3.61 శాతం వాటాతో ఆ సంస్థలో నాలుగవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్నారు. ఎన్విడియా షేర్లు 13 శాతానికి పైగా పడిపోవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు 50,000 కోట్ల డాలర్లు తగ్గే పరిస్థితి ఏర్పడింది. అంతేగాకుండా దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) రంగానికి సంబంధించిన షేర్లు కూడా పతనమయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events