తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య పెరుగుతున్న ఎడబాటు, తరిగిపోతున్న ప్రేమల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా ఓ తండ్రి తీర్పు. ఈ చిత్రాన్ని లయన్ అరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో ఏవీకే ఫిలింస్ పతాకంపై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్నారు. ప్రతాప్, శ్రీరామ్, అనురాధ, మంజుల తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహర్తపు సన్నివేశానికి నిర్మాత దామెదర్ ప్రసాద్ క్లాప్‌నివ్వగా, సంగీత దర్శకుడు కోటీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజేప్పే చిత్రమిది. సందేశాత్మకంగా ఉంటూ ఆకట్టుకుంటుంది అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ పిల్లల మధ్య బంధాలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదతో తెలియజెప్పే సందేశాత్మక చిత్రమిది అన్నారు. ఇవాళ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దూరం పెరుగుతున్నది. వారి మధ్య అనుబంధాలు, ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నాం అన్నారు.