Namaste NRI

రిస్క్- ఏ గేమ్ ఆఫ్ యూత్ మూవీ నుండి ఓ హసీనా లిరికల్ సాంగ్

20ఏండ్ల క్రితం వచ్చిన 6 టీన్స్‌ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమా రిస్క్‌ – ఏ గేమ్‌ ఆఫ్‌ యూత్‌. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్‌ అశ్వా, తరుణ్‌ సాగర్‌, అర్జున్‌ ఠాకూర్‌, విశ్వేష్‌, సన్య ఠాకూర్‌, జోయా ఝవేరీ ఇందులో ప్రధాన పాత్రధారులు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలో రెండో పాటను నటుడు సత్యం రాజేశ్‌ లాంచ్‌ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.  ఓ హసీనా  అంటూ సాగే ఈ పాటను ఘంటాడి కృష్ణ స్వరపరచగా, వరికుప్పల యాదగిరి రాసి, స్వయంగా ఆలపించారు. మర్డర్‌ మిస్టరీ కంటెంట్‌తో థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే యూత్‌ఫుల్‌ ఎంటైర్టెనర్‌ ఇదని, డిసెంబర్‌ 27న సినిమాను విడుదల చేస్తున్నామని ఘంటాడి కృష్ణ తెలిపారు. రాజీవ్‌ కనకాల, అనీష్‌ కురువిళ్ల ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ కొమరి.

Social Share Spread Message

Latest News