శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. సుంకర రామ బ్రహ్మాం నిర్మాత. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ సినిమా రాబోతుంది. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ మహా సముద్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఉప్పెన వచ్చే ముందుండే ప్రశాంత తల ఇంకొన్ని గంటలు మేం అలా ఉంటాం. మహా సముద్రం ఫస్ట్ వేవ్ చూశారు. సెకండ్ వేవ్ చూశారు. ఇక రేపు చూడబోయే ఉప్పెన అని అనుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ మీద ముందు అజయ్ భూపతికి కాన్ఫిడెన్స్ ఉండేది. ఇప్పుడు మా అందరికి తెలుస్తుంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు. ఓవర్సీస్లో భారీ ఎత్తున విడుదలవుతోంది. కోవిడ్ తరువాత అత్యంత భారీ ఎత్తున విడుదలవుతున్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి. పండుగ ఉండటం వల్ల ఒక రోజు మాకు కలసి వస్తుంది అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)