తమన్నా కథానాయిక నటిస్తున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ఓదెల-2. అశోక్‌తేజ దర్శకత్వం. ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు సంపత్‌నంది క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలందించారు. తమన్నా నాగసాధువు భైరవి పాత్రలో కనిపించనుంది. ముంబయిలో జరిగిన ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ దుష్టశక్తి నుంచి ఓదెల గ్రామానికి పొంచి ఉన్న ముప్పు గురించి తెలుసుకున్న అక్కడి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతారు. తమ జీవితాలను చీకటి కబళించబోతున్నదని ఆవేదన చెందుతారు. అలాంటి సమయంలో వారిని రక్షించడానికి నాగసాధువు గ్రామంలోకి ప్రవేశిస్తుంది. చెడుని ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేస్తుంది.

ఈ నేపథ్యంలో నడిచే పరిణామాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నాగసాధువుగా తమన్నా నటన, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్‌గా నిలిచాయి. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ తదితరులు నటించారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్ వర్క్స్, దర్శకత్వం: అశోక్‌తేజ.
