గల్ఫ్ దేశం ఒమాన్ కొత్త కార్మిక చట్టాన్ని తీసుకొచ్చింది. మంత్రి మండలి, ఒమాన్ కౌన్సిల్ మధ్య అనేక సంప్రదింపులు, చర్చల తర్వాత వివిధ పార్టీల విస్తృత భాగస్వామ్యంతో ఈ కొత్త కార్మిక చట్టాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఒమాన్ సెలవులకు సంబంధించిన కొత్త నిబంధనలు ప్రకటించింది. ప్రధానంగా సిక్ లీవ్ డేల సంఖ్యను 182 రోజులకు పెంచడం జరిగింది. కాగా, కొత్త చట్టంలో కొత్త లీవ్‌లు కూడా మంజూరు చేయబడ్డాయి. దీనిలో భాగంగా 7 రోజుల పితృత్వ సెలవు, 15 రోజుల సంరక్షకుని సెలవులు అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో పాటు, అనారోగ్య సెలవు రోజుల సంఖ్యను 182 రోజులకు పెంచింది. ఇక వర్కింగ్ మహిళలకు వారి పిల్లల సంరక్షణ కోసం రోజుకు ఒక గంట, 98 రోజుల పాటు ప్రసూతి సెలవులు ఉన్నాయి.