అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా చిన్నారులు, యుక్త వయసులోని వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. లాస్ ఏంజెలెస్ కౌంటీలో నమోదైన కరోనా కేసులో 70 శాతానికి పైగా 18`49 వయసు నుంచే ఉన్నాయి. నెల క్రితం పోలీస్తే 18`29 వయసులోని వారు ఇన్ఫెక్షన్ బారిన పడడం ఎనిమిది రెట్లు పెరిగింది. 30`49 మధ్య వయసున్న వారు నెల క్రితంతో పోలిస్తే ఆరు రెట్టు అధికంగా కరోనా బారినపడుతున్నారు. క్యాలిఫోర్నియాలో ఆరెంజ్ కౌంటీలో 5`11 వధ్య వయసులోని చిన్నారుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. సౌత్ నెవెడాలో టీనేజీ, యుక్త వయసు వారు కరోనా బారిన పడుతున్నారు.
ప్రతి లక్ష మందికి గాను 45 కేసులు 18`24 వయసు గ్రూపు నుంచే ఉంటున్నాయి. మొత్తానికి కరోనా కారణంగా 19 శాతం మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సగటు రేటు 58 శాతం పెరిగింది. చికాగోని చిన్న పిల్లల ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత భారీ సంఖ్యలో కేసులను చూస్తున్నట్టు అడ్వొకేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైస్ చైర్మన్ మైఖేల్ క్యాపెల్లో తెలిపారు.