కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. సుమారు 30 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. కాలిఫోర్నియాలో మొదటి కేసును, ఆ తర్వాత మిన్సెసోటలో మరో కేసును గుర్తించారు. ఒమిక్రాన్ ఆందోళనకమైన వేరియంట్ అని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)