ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆందోళనకర ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. తాజాగా కొవిడ్ 19 మహమ్మారి పుట్టిన చైనాలోనూ తొలి కేసు నమోదయ్యింది. నవంబర్ 27న విదేశాల నుంచి గ్వాంగ్జౌ వచ్చిన సదరు వ్యక్తికి తొలుత పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది, రెండు వారాల క్వారంటైన్ అనంతరం పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపింది. ఆ ఫలితాలను మరింత లోతుగా అధ్యయనం చేయగా ఒమిక్రాన్ తేలిందని చైనా వెల్లడిరచింది.. చైనాలో టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినట్టు అక్కడి అధికారులు వెల్లడిరచారు. యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. అయితే, ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం వెల్లడిరచలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే డెల్టా ప్రభావంతో వణికిపోతున్న చైనాలో తాజాగా ఒమిక్రాన్ వెలుగు చూడడం అధికార వర్గాలను కలవరపెడుతోంది
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)