అగ్రరాజ్యం అమెరికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. అమెరికాలో ఇప్పటివరకు 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ. అమెరికా సిడిసి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తాజా నివేదిక ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 43 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, వీటిలో 34 మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునవ్నారున్నారు. వీరిలో 14 మంది బూస్టర్ డోసు (మూడో డోసు)కూడా తీసుకున్నవారు ఉండడం గమనార్హం. మొత్తం 22 రాష్ట్రాలలో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ 43 కేసులలో 25 మంది 18 నుంచి 39 వయసు కలవారున్నారు. కేవలం ఆరుగురు మాత్రమే ఇంతుకుముందు కరోనా సోకిన వారున్నారు. అమెరికాలో ఒమిక్రాన్ మొట్టమొదటి కేసు డిసెంబరు 1న నమోదు అయింది. అది కూడా పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తికే కావడం గమనార్హం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)