చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు సైతం ఈ పండుగను ఏటా ఎంతో సందడిగా జరుపుకుంటుంటారు. కాగా, హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్లో పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించింది. ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. దీపావళి పర్వదినాన స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్కుమార్, సంఘం నాయకులకు అండగా నిలిచినందుకు గర్వపడుతున్నాను. ఈ ప్రకటనతో దీపావళి ముందుగానే వచ్చినట్లయ్యింది అని మేయర్ ఎరిక్ అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-269.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-268.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-271.jpg)