దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా మంగళవారం. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చి త్రానికి అజయ్ భూపతి ఎ క్రియేటివ్ వర్క్ నిర్మాణ భాగస్వా మి. ముద్ర మీడియా వర్క్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ కలిసి ఈ సినిమాను నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన తారాగణం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్ లో దిల్‌రాజు మాట్లాడుతూ మంగళవారం సినిమా కథ విన్నప్పుడు అన్వేషణ గుర్తొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు అరుంధతి కళ్ల ముందు మెదిలింది అని అన్నారు. కొత్తనటీనటులతో అజయ్ అద్భుతమైన విజయం సాధించాడు. కథ నచ్చడంతో నైజాం హక్కులు తీసుకున్నా అన్నారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ ఆర్‌ఎక్స్ 100 కంటే మంచి సినిమా తీశావ్ అని ప్రేక్షకులు ప్రశంసిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. ఒక్క సినిమాతో నా పని అయిపోయిందనుకున్నారు, మంగళవారంతో అది తప్పని నిరూపించాను అని పాయల్ రాజ్‌పుత్ చెప్పారు. ఇంత పెద్ద విజయాన్నిచ్చినందుకు ప్రేక్షకులకు నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయల్ రాజ్‌పుత్, స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, దాశరథి శివేంద్ర తదితరులు పాల్గొన్నారు.