కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా సమ్మతమే. చాందిని చౌదరి నాయికగా నటిస్తున్నది. ఇప్పుడీ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. వినూత్నమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు ఆదరణ లభించింది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయగ్రహణం: సతీష్ రెడ్డి మాసం.














