పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. టీజర్, ఫస్ట్‌లుక్‌లకు మంచి స్పందన లభించింది. అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఓ ప్రత్యేకమైన టీజర్‌ను లేదా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి కాగా, తదుపరి షెడ్యూల్ కోసం త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు తెలిసింది. ఆ వివరాలన్నిటినీ ఆ ప్రచార చిత్రాలతో ప్రకటించే అవకాశాలున్నాయి. మొఘలాయిల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
