Namaste NRI

న్యూ ఇయర్‌ సందర్భంగా ఘోస్ట్‌ కొత్త పోస్టర్‌ను విడుదల

కన్నడ హీరో  శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్న చిత్రం ఘోస్ట్‌. ఈ చిత్రాన్ని సందేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సందేశ్‌ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివరాజ్‌ కుమార్‌ రెట్రో లుక్‌ వైవిధ్యంగా ఉంది. డాక్టర్‌ శివరాజ్‌ కుమార్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు. జయరామ్‌, ప్రశాంత్‌ నారాయణ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ఇటీవలే మైసూర్‌లో పూర్తయింది. వచ్చే నెలలో బెంగళూరులో వేసిన భారీ సెట్‌లో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మహేంద్ర సింహ, సంగీతం : అర్జున్‌ జన్య.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events