Namaste NRI

అనుష్క జన్మదినం సందర్భంగా.. భాగమతి-2

అగ్ర కథానాయిక అనుష్క జన్మదినం సందర్భంగా భాగమతి-2 చిత్రాన్ని ప్రకటించారు. ఇది అనుష్క నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం. లేడీ ఓరియెంటెడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో అనుష్క నటించిన భాగమతి చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సీక్వెల్‌ కూడా ఆసక్తికరమైన కథ, కథనాలతో సాగుతుందని,  అనుష్క పాత్ర నవ్యరీతిలో ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events