Skip to main content

Namaste NRI

క్రిస్మస్‌ సందర్భంగా నాని మూవీ…ఫస్ట్ లుక్ పోస్టర్

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హిట్‌: ది థర్డ్‌ కేస్‌. సక్సెస్‌ఫుల్‌ హిట్‌ సినిమా ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రమిది. శైలేష్‌ కొలను దర్శకత్వం.  ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. శ్రీనిధిశెట్టి కథానాయిక. ప్రస్తుతం కశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని, అర్జున్‌ సర్కార్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని ైస్టెలిష్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు. కశ్మీర్‌ షెడ్యూల్‌లో యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నామని, ఇవి సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు. వచ్చే ఏడాది మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్‌ వర్గీస్‌, సంగీతం: మిక్కీ జే మేయర్‌, రచన-దర్శకత్వం: శైలేష్‌ కొలను.

Social Share Spread Message

Latest News