Namaste NRI

కమల్‌హాసన్‌ జన్మదినం సందర్భంగా.. థగ్‌ లైఫ్‌ ఫస్ట్‌లుక్‌

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. కమల్‌హాసన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు థగ్‌ లైఫ్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ రంగరాయ శక్తివేల్‌ నాయకర్‌ పాత్రలో కనిపించనున్నారు. అనౌన్స్‌మెంట్‌ వీడియోలో శత్రువులతో పోరు చేస్తూ యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు కమల్‌. దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, జయం రవి తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తు న్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కె చంద్రన్‌, సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్‌ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌, రచన-దర్శకత్వం: మణిరత్నం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events