Namaste NRI

మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా.. విశ్వంభర గ్లింప్స్ విడుద‌ల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న‌ చిత్రం విశ్వంభర. చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా  ఓ స్పెషల్‌ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ  మీకు అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో, బెస్ట్ క్వాలిటీతో మూవీని మ‌న ముందుకు తీసుకురావాల‌నే చిత్ర బృందం ఇంత స‌మయం తీసుకుంటుంద‌ని చిరంజీవి అన్నారు. ఇది చంద‌మామ క‌థ‌లాగా సాగిపోయే అద్భుత‌మై క‌థ‌. చిన్న పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌వాళ్ల‌లో ఉండే చిన్న పిల్ల‌ల‌కి ఈ సినిమా బాగా న‌చ్చుతుంది అని చిరంజీవి అన్నారు. ఇక మూవీని 2026 సమ్మ‌ర్‌కి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిరంజీవి స్వ‌యంగా చెప్పుకొచ్చారు.

చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా గ్లింప్స్ విడుద‌ల చేశారు. అస‌లేం జ‌రిగిందో ఈ రోజైన చెబుతావా అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొద‌లైంది. ఇందులో ప్ర‌తి స‌న్నివేశం ఆక‌ట్టుకునేలా ఉంది. చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం భారత పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. మన పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలు ఉన్నాయని చెబుతారు. యమలోకం, పాతాళం, స్వర్గం వంటి వాటి వరకు సినిమాల్లో చాలామంది చూపించారు. విశ్వంభర లో ఆ 14 లోకాలకు మూలమైన సత్యలోకాన్ని చూపించబోతున్నాం అని ఇటీవ‌ల ద‌ర్శకుడు చెప్పుకొచ్చారు. ఈ కథలో కథానాయకుడు ఆ లోకానికి ఎలా వెళ్తాడు? అక్కడి నుంచి కథానాయికను భూమిపైకి ఎలా తీసుకొస్తాడు? అన్న అంశం చుట్టూ సినిమా ఉంటుంద‌ని చెప్పాడు. చిరంజీవికి జోడీగా త్రిష నటించగా, మరో కీలక పాత్రలో ఆషికా రంగనాథ్ కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పటికీ, ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, భీమ్స్‌ సిసిరోలియో, దర్శకత్వం: వశిష్ట, నిర్మాతలు: విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌, నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events