అమెరికాలోని న్యూజెర్సీలో గల హోప్ 4 స్పందన అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా హోప్ 4 స్పందన సహకారంతో టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా 10 మంది వికాలంగులకు చేయూత నిచ్చారు. ఈ సందర్భగా మంత్రి కేటీఆర్‌కు మహేశ్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేశ్ బిగాల మాట్లాడుతూ మంత్రి 2009లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. నాటి నుంచి సిరిసిల్ల పట్టణాభివృద్ధి కోసం ఎంతో శ్రద్ద వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పీవీ వాణిదేవి, సినీ నటి అనసూయ తదితరులు పాల్గొన్నారు.