Namaste NRI

మురళీమోహన్‌ జన్మదినం సందర్భంగా.. డొక్కా సీతమ్మ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

మురళీమోహన్‌, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డొక్కా సీతమ్మ. రవి నారాయణ్‌ దర్శకుడు. వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్‌ నిర్మాతలు. మురళీమోహన్‌ జన్మదినం సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ  వేల మంది ఆకలిని తీర్చిన డొక్కా సీతమ్మ ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు పొందారని, కాటన్‌ దొర సైతం ఆమెను ప్రశంసించారని, అలాంటి గొప్ప మహిళ మీద సినిమా తీయడం ఆనందంగా ఉందన్నారు. నేటితరం తెలుసుకోవాల్సిన చరిత్ర ఇదని దర్శకుడు టీవీ రవినారాయణ్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సవ్‌, సంగీతం: కార్తిక్‌ కొడకండ్ల, నిర్మాణ సంస్థ: ఉషారాణి మూవీస్‌, దర్శకత్వం: టీవీ రవి నారాయణ్‌.

Social Share Spread Message

Latest News