Skip to main content

Namaste NRI

నాగార్జున జన్మదినం సందర్భంగా.. మరోసారి మాస్‌

తెలుగు సినీరంగంలో ప్రస్తుతం  రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్నది. అలనాడు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచిన చిత్రాలను మరలా ప్రేక్షకులకు ముందుకుతీసుకొస్తున్నారు. నాగార్జున నటించిన సూపర్‌హిట్‌ మూవీ మాస్‌ ఫోర్‌కే ఫార్మాట్‌లో ఆయన జన్మదినం సందర్భంగా ఈ నెల 29న రీరిలీజ్‌ కానుంది. 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో నాగార్జునకు అత్యధిక వసూళ్లు అందించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మించారు. ఈ సినిమాలో జ్యోతిక, ఛార్మి, రఘువరన్‌, రాహుల్‌దేవ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతా న్నందించారు. ఫోర్‌కే ఫార్మాట్‌లో రీరిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం నాగార్జున అభిమానులను అలరిస్తుందని చిత్ర బృందం పేర్కొంది.

Social Share Spread Message

Latest News