టాలీవుడ్ యువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రానికి స్వయంభూ అనే టైటిల్‌ను నిర్ణయించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. నిఖిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నట్టు ఫస్ట్ లుక్ చెబుతోంది. ఆగస్టులో షూటింగ్ షురూ కానుంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో నిఖిల్ కెరీర్లోనే భారీ వ్యయంతో నిర్మించబోతున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: రవి బస్రూర్, ప్రొడక్షన్ డిజైనర్: ఎం. ప్రభాహరన్, రచన-

















