Namaste NRI

గణతంత్ర దినోత్సవం సందర్భంగా..  ఎయిర్ ఇండియా స్పెషల్‌ ఆఫర్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్లు ప్రకటించింది. దేశీయంగా వివిధ నగరాలు, పట్టణాల మధ్య తిరిగే విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారికి ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఆయా విమాన సర్వీసుల్లో ఈ ఆఫర్ లిమిటెడ్ సీట్లకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్ ఇండియా తన అఫిషియల్ వెబ్ సైట్ లో వెల్లడించింది. సెలెక్ట్ చేసిన 49 రూట్లలో ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యం లభిస్తుందని తెలిపింది.

ఈ నెల 21 నుంచి 23 వరకు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి ఈ డిస్కౌంట్ లభిస్తుందని ఎయిర్ ఇండియా వివరించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించవద్చునని తెలిపింది. ఆసక్తి గల ప్రయాణికులు ఎయిర్ ఇండియా సిటీ ఆఫీస్, ఎయిర్ పోర్ట్ ఆఫీస్, వెబ్ సైట్లు, మొబైల్ యాప్స్, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా టికెట్ ధరలు రూ.1075 నుంచి మొదలవుతాయని పేర్కొంది. ఎంపిక చేసిన రూట్లలో డిస్కౌంట్‌ ధరలులు ఎయిర్‌ ఇండియా తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. న్యూఢిల్లి నుంచి ముంబై, చెన్నయ్‌ నుంచి న్యూఢిల్లి, బెంగళూర్‌ నుంచి ముంబై, ఢిల్లి నుంచి ఉదయ్‌ పూర్‌, ఢిల్లి నుంచి గోవా, ఢిల్లి నుంచి పోర్టుబ్లేయర్‌, ఢిల్లి నుంచి శ్రీనగర్‌, అహ్మదాబాద్‌ నుంచి ముంబై, గోవా నుంచి ముంబై, దింపూర్‌ నుంచి గౌహతీ రూట్లలో రాయితీపై టికెట్లు పొందవచ్చని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events