Namaste NRI

సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా..తిరుమలకు కాలి నడకన ఎన్నారైలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అమెరికా ఎన్నారైలు తిరుమల కొండను కాలి నడకన చేరుకున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి, రవి పొట్లూరి మరికొందరు రేవంత్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా నుండి హైదరాబాద్ వచ్చారు. వారందరూ ఇంతటి విజయాన్ని రేవంత్ రెడ్డికి అందించిన తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమల చేరుకొన్నారు.

ఈ సందర్భంగా  రవి పొట్లూరి మాట్లాడుతూ మేమందరం ఏడు కొండలు నడిచి ఎక్కుతామని శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకొన్నాము. ఇప్పుడు స్వామి వారి మొక్కు చెల్లించాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందాలని కోరుకొంటామని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పథంలో ప్రయాణించాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. అనుముల జగదీశ్వర్ రెడ్డి, కాట్ల రాజు, మిడుదుల సుధీర్ రెడ్డి, స్రవంత్, ఆదిత్య, ముప్పారాజు, శేఖర్ తిరుమల కొండ మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు.  రేవంత్ రెడ్డికి అమెరికాలో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events