Namaste NRI

సంయుక్తా మేనన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా… స్వయంభూ నుంచి ఫస్ట్‌లుక్‌

నిఖిల్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం స్వయంభూ. పీరియాడిక‌ల్ యాక్షన్‌ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కు భరత్‌ కృష్ణమాచారి ద‌ర్శ‌క‌త్వం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సంయుక్త , న‌భా న‌టేష్ క‌థ‌నాయిక‌లు. ఈ మూవీ కోసం సంయుక్తా మేనన్ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే సినిమా నుంచి నిఖిల్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు సంయుక్తా మేనన్, న‌భా న‌టేష్ లుక్‌లను విడుద‌ల చేశారు.

అయితే నేడు సంయుక్త పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ సంయుక్త కు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్‌ ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో క‌ద‌న‌రంగంలోకి దూకిన ఓ యోధురాలిగా సంయుక్త క‌నిపిస్తుంది. పోస్ట‌ర్ చూస్తుంటే ఈ మూవీకోసం సంయుక్త చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా,  త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మూవీకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌. రవి బస్రూర్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీ గానే ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events