సందీప్ కిషన్ కథానాయకుడిగా పవర్ పేట పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్నది. రచయిత కృష్ణ చైతన్య దర్శకుడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. సందీప్‌కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. అభిమానుల అరుపులు, సంబరాల మధ్య ఓ సినిమా థియేటర్‌లో గ్లింప్స్ మొదలైంది. ఆ కోలాహలం మధ్య హీరో ఎంట్రీ సిగరెట్ తాగుతూ, సింహం గురించి పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పడంతో థియేటర్‌లో అరుపులు మిన్నంటాయి. థియేటర్ స్క్రీన్‌పై బాణాసంచా విసరడంతో గ్లింప్స్ పూర్తయింది.

సందీప్‌కిషన్ ఈ గ్లింప్స్‌లో పీరియాడిక్ అవతార్‌లో కనిపించారు. ైస్టెలిష్ షేడ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, రా ఆటిట్యూడ్.. ఇవన్నీ మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఉన్నాయి. ఈ గ్లింప్స్‌లోని ఆయన పాత్ర పేరు సేనాపతి రవి అని రివీల్ చేశారు. సందీప్ కిషన్ స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ ఆ పాత్రలోని డామినేషన్, ఇంటెన్సిటీని సూచిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి కెమెరా: మదీ, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్.





























