సుధీర్‌బాబు కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సోనాలీ నారంగ్, సృష్టి సెల్యులాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంస్థలో నారాయణదాస్ కె నారంగ్, పూస్కుర్ రామ్‌మోహన్ రావు నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి మామా మశ్చీంద్ర అనే టైటిల్‌ను ప్రకటించారు. ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సుధీర్ బాబు రాక్ స్టార్‌గా కనిపిస్తున్నారు. తెలుగు, హిందీ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటున్నది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు వైవిధ్యంగా కనిపిస్తారని చిత్ర బృందం చెబుతున్నారు. కీలక పాత్రల్లో నటించే వారి వివరాలను త్వరలో వెల్లడిరచనున్నారు. మశ్చీంద్ర అనే పదానికి పవర్ కోరుకునేవాడు ధైర్యవంతుడనే అర్థాలు వస్తాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి ఆర్ట్: రాజీవ్, సినిమాటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: చేతన్ భరద్వాజ్.














