లూలూ గ్రూపు చైర్మన్, ఎన్నారై ఎంఏ యూసఫ్ అలీ తన ఉదారత చాటుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూఏఈలో నిర్వహిస్తున్న వన్ బిలియన్ మీల్స్ అనే ప్రచార కార్యక్రమానికి 1కోటి దిర్హమ్స్ విరాళం ప్రకటించారు. మన కరెన్సీలో రూ. 22.39కోట్లు. ఈ సందర్భంగా యూసఫ్ అలీ మాట్లాడుతూ ఎండోమెంట్ క్యాంపెయిన్‌కు విరాళం ఇవ్వడం అనేది దాతృత్వానికి ప్రపంచ కేంద్రంగా యూఏఈ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి తన నిబద్ధతగా పేర్కొన్నారు. మానవతావాద పనుల్లో యూఏఈ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. అలాగే వన్ బిలియన్ మీల్స్ సహాయ నిధి కార్యక్రమానికి సహకరించడం ద్వారా పేదలకు సహాయం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రంజాన్ స్థిరమైన ఆహార సహాయ నిధిని ప్రారంభించాలనే లక్ష్యంతో యూఏఈ ఈ వన్ బిలియన్ మీల్స్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.