Namaste NRI

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. జస్ట్‌ ఏ మినిట్‌ నుంచి ప్రేమగీతం

అభిషేక్‌ పచ్చిపాల, నజియా ఖాన్‌, జబర్దస్త్‌ ఫణి, సతీశ్‌ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం జస్ట్‌ ఏ మినిట్‌. రెడ్‌ స్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కార్తీక్‌ ధర్మపురి ప్రెజెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి రెండో పాటను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హేమంత్‌ గారి గాత్రం ఈ సాంగ్‌కు ప్లస్‌ అయిందని, రాంబాబు గోసాల గారి సాహిత్యం యువతను అలరిస్తుందని చెప్పారు. అతి త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అమీర్‌, సంగీతం: ఎస్‌.కె.భాజీ, నిర్మాతలు: అర్షద్‌ తన్వీర్‌, డాక్టర్‌ ప్రకాశ్‌ ధర్మపురి, దర్శకత్వం: పూర్ణస్‌ యశ్వంత్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events