Namaste NRI

చంద్రబాబు విడుదలపై.. జయరాం కోమటి హర్షం

తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై విడుదల కావడంపై అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేత జయరాం కోమటి హర్షం వ్యక్తం చేశారు.  కాగా, ఈ  సందర్భంగా బే ఏరియాలో జయరాం కోమటి ఆధ్వర్యంలో సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.  స్థానిక తెలుగుదేశం అభిమానులు వెంకట్ కోగంటి, సుబ్బా యంత్ర, శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త బల్ల, వెంకట్ అడుసుమల్లి, లియోన్ బోయపాటి, వెంకట్ కోడూరి, డాక్టర్ రమేష్ కొండ, సందీప్, రవి కిరణ్, భరత్ ముప్పిరా  ళ్ళ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా   జయరాం కోమటి  మాట్లాడుతూ సత్యమేవ జయతే స్ఫూర్తితో, తలవంచని తత్వంతో ప్రజాశేయస్సే పరమావధిగా అనుక్షణం తపించే చంద్రబాబు ప్రజా క్షేత్రంలో తిరిగి అడుగుపెట్టబోతు న్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలే ఆయనకు ఆశీర్వాదాలని అన్నారు.  చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అమెరికాలోని టీడీపీ ఎన్నారైలు, టీడీపీ అభిమానులు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.  గత రెండు నెలలుగా అనునిత్యం చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ పార్టీకి అండగా ఉన్నందుకు కృతజతలు తెలిపారు.  భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో అందరం ముందుకుసాగాలని, అంతిమ విజయం సాధించే వరకు కదం తొక్కుతూ పోరాడదామని జయరాం కోమటి పిలుపునిచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events