Namaste NRI

మిస్టర్‌ కింగ్‌ నుంచి నేనెరగని దారిలో

శరణ్‌ కుమార్‌ హీరోగా శశిధర్‌ చావలి తెరకెక్కిస్తున్న చిత్రం  మిస్టర్‌ కింగ్‌. బి.ఎన్‌.రావు నిర్మాత.  ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని నేనెరగని దారేదో అనే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటను మణిశర్మ స్వరపరచగా, కడలి సాహిత్యమందించారు. హారిక నారాయణ్‌ ఆలపించారు. యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాతో విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ హీరోగా పరిచయవుతున్నారు. నిర్మాణాంతర పనులు పూర్తి చేసి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి తన్వీర్‌ అంజుమ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events