Namaste NRI

రవితేజ-గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌ లో మరోసారి

హీరో రవితేజ,  గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. రవితేజ-గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. దీంతో తాజా సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతున్నది. మాసియెస్ట్‌ కాంబో ఈజ్‌ బ్యాక్‌ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేస్తున్నది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందించబోతున్నారు. వీరిద్దరి కలయికలో గతంలో డాన్‌ శీను, బలుపు, క్రాక్‌ వంటి హిట్‌ చిత్రాలొచ్చాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events