మానవసేవే మాధవ సేవ అని మనసావాచా నమ్మే మెగాస్టార్ చిరంజీవి మరో సారి తన ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ సినిమాటోగ్రాఫర్కు సాయమందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కెమెరామెన్ దేవ్రాజ్ పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి ఆయనను కలిసి రూ.5లక్షలు చెక్కు అందించారు. దేవ్రాజ్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు చిరు. తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో 300కు పైగా సినిమాలకు పనిచేశారు దేవ్రాజ్. చిరంజీవి నటించిన నాగు, పులి బెబ్బులి, రాణి కాసుల రంగమ్మ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్గా పనిచేశారు దేవ్రాజ్. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, ఎంజీఆర్, రజినీకాంత్, రాజ్ కుమార్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు కూడా వర్క్ చేశారు. దేవ్రాజ్కు అండగా నిలిచిన చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు.