ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల మరోసారి వాయిదా పడిరది. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సిన ఆర్‌ఆర్‌ఆర్ కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా అక్టోబర్‌కి వాయిదా పడిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల చేసేందుకు పోస్ట్ ప్రొడెక్షన్ చాలా వరకూ పూర్తయ్యింది. కానీ, అందరూ అనుకున్నట్లు ఆర్‌ఆర్‌ఆర్ విడుదల వాయిదా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాం. థియేటర్లు పున ప్రారంభమైన వెంటనే తప్పకుండా సినిమా విడుదల చేస్తాం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం వెల్లడిరచింది.
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆలియాభట్, శ్రియ, అజయ్‌దేవ్‌గణ్, ఒలీలియా మోరీస్, సముద్రఖని కీలకపాత్రల్లో సందడి చేయనున్నారు.